కనీస వేతనం చెల్లించాలి
విశ్వంభర,నెల్లికుదురు: పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్లకు కనీస వేతనం అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర నేత ఇసంపెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు తో పాటు వివిధ ప్రాంతాల నుంచి స్కావెంజర్లు హైదరాబాద్ ప్రజావాణికి మంగళవారం తరలి వెళ్లారు. వీరిని ఉద్దేశించి సైదులు మాట్లాడుతూ, స్కావెంజర్లను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఇస్తున్న వేతనాన్ని ఎకౌంట్లో జమ చేయాలన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలను నమ్ముకొని అసలే చాలని వేతనంతో సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు.పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి స్కావెంజర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో నెమ్మది వెంకటేశ్వర్లు , మంజుల,ప్రకాష్,ఐలమ్మ,సుగుణ,సురేష్, ముత్తయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



