బీరప్ప ఉత్సవాల్లో హరీశ్ రావు
On
విశ్వంభర, సిద్దిపేట: రూరల్ మండలం చింతమడక గ్రామంలోని బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మీ అందరిని అడిగనట్టు చెప్పారని, బీరప్ప ఉత్సవాలకు సహాయం కూడా అందించారన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, బీరప్ప స్వామి దయతో మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు. బీరప్ప ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించారని, గ్రామస్తులు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షించారు. నా వంతు సహాయంగా కూడా లక్ష రూపాయలు ఇచ్చానన్నారు. స్వామి దయతో అన్నింటా శుభం జరగాలని కోరుకున్నారు.



