శివాచార్య స్వామి జన్మదిన వేడుకలు 

శివాచార్య స్వామి జన్మదిన వేడుకలు 

విశ్వంభర, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదశివపేట మండలంలోని తంగేడుపల్లి గ్రామ శివారులో ఎంతో ఆహ్లాద వాతావరణంలో కొలువైన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురుగంగాధర మహాస్వామి ఆశ్రమ మఠాధిపతి  శివయోగి శివచార్య మహాస్వామి 31 వ జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న,వీరశైవ సమాజ జిల్లా అధ్యక్షుడు ఇప్పుపల్లి నర్సింలు, వీరశైవ సమాజం సభ్యులు  ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ  మార్చి 22వ తేదీ  ఆదివారం నాడు  శివాచార్య మహాస్వామి అప్పగారి జన్మదినోత్సవం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags: