విద్య తో పాటు క్రీడల్లోనూ రాణించాలి 

విద్య తో పాటు క్రీడల్లోనూ రాణించాలి 

విశ్వంభర, పూడూరు:  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి,   పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  సందర్శించారు.ఈ సందర్భంగా శివసేన రెడ్డి  మాట్లాడుతూ,  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి  పాఠశాలలను నిరంతరం సందర్శిస్తూ విద్యా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని,అందుకు అవసరమైన క్రీడా సామగ్రిని అందించాలని కోరినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా విద్యార్థులందరికీ వాలీబాల్ కిట్లు, క్రికెట్ కిట్లు తదితర స్పోర్ట్స్ సామాగ్రిని అందజేసినట్లు తెలిపారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునాథరెడ్డి, డిసిసి కార్యదర్శి పెంటయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: