ఉపాధి పథకం దరఖాస్తుల ఆహ్వానం
On
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ కి ఆర్థిక పునరావాస పథకం కింద రూ..75,000 చొప్పున మొత్తం 3 యూనిట్ లకు 2,25,000 రూపాయలు 100 శాతం సబ్సిడీ మీద జిల్లా కి కేటాయించారు. ఈ మేరకు జిల్లాలోని అర్హులైన ట్రాన్స్ జెండర్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. . దరఖాస్తు పత్రాన్ని www.wdsc.telangana.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హులు ధ్రువపత్రాలతో ఈనెల 27లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, దివ్యాంగుల, వయోవృద్ధుల , ట్రాన్స్ జెండర్స్ శాఖ, కలెక్టరేట్ కాంప్లెక్స్ , మహబూబాబాద్ రూమ్ నెంబర్ 2 నందు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం. సభిత గారు ఒక ప్రకటనలో తెలిపారు.



