విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

విశ్వంభర, ఇనుగుర్తి: విద్యతోనే వ్యక్తులకు గౌరవం, కీర్తి జీవితంలో స్థిరత్వం చేకూరుతుందని కేసముద్రం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మామిడి అశోక్ అన్నారు. అశోక్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఇనుగుర్తి లోని హై స్కూల్ 8వ,9వ తరగతుల విద్యార్థినీ,విద్యార్థులకు మంగళవారం నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  లక్ష్యాలను ఎంచుకొని వాటి  సాకారం కొరకు క్రమశిక్షణ అలవరచుకుంటూ ఏకాగ్రతతో చదవాలన్నారు. అప్పుడే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందని,సమాజం రెస్పెక్ట్ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్.ఎం.అమ్మ యాకయ్య, బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి,వివేకానంద విద్యాసంస్థల చైర్మన్,క్లబ్ ఫాస్ట్ జడ్జి క్లబ్ జడ్సీ చిర్ర యాకాంతం గౌడ్, అయ్యగారి పల్లి సర్పంచి ఎం.శోభన్, జడ్జి వెంకటరెడ్డి,యర్నం శ్రీరాములు, బెజ్జం ప్రేమ్ కుమార్, మారం సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: