రెండు నెలల కొడుకును చంపిన తల్లి
On
విశ్వంభర, కుత్బుల్లాపూర్ : నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపేట్ లో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సానేవల్లి నిర్మాణం వద్ద హృదయ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎసిపి శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రెండు నెలల కిందట మ ధ్యప్రదేశ్ నుండి వచ్చి వాచ్మెన్ గా జీవనం కొనసాగిస్తున్న మమతా రాజేందర్ దంపతులకు ప్రేమ వివాహం జరిగింది . వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. ఉన్నట్టుండి తల్లి మమత అతికిరాతకంగా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి పొయ్యిలో పెట్టి తన బిడ్డను తానే చంపింది. ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలియలేదు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దుండిగల్ పోలీసులు తెలిపారు.



