సేవాలాల్ సేవలు మరువలేనివి : ఎమ్మెల్సీ కోటిరెడ్డి

సేవాలాల్ సేవలు మరువలేనివి : ఎమ్మెల్సీ కోటిరెడ్డి

 విశ్వంభర, త్రిపురారం: గిరిజనుల ఉద్ధరణ కోసం సంతు సేవాలాల్ చేసిన కృషి మరువలేదని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండలం, లోక్యా తండాలో సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి హాజరయ్యారు. వారికి  మాజీ ట్రైకర్ చైర్మన్, ఇస్లావత్ రామచంద్రనాయక్ తో కలిసి గిరిజనుల సాంప్రదాయంగా గిరిజన మహిళలు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,  సంతు సేవాలాల్ మహారాజ్ జీవితం బావి తరాలకు ఆదర్శమని, సంతు సేవాలాల్ బోధనలు అనుసరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జ్యోతి కాంతారావు నాయక్, అప్పలమ్మ గూడెం సర్పంచ్ రాజు నాయక్, డొంక తండ సర్పంచ్ బిచ్చు నాయక్, బొర్రాయపాలెం సర్పంచ్ పుల్లయ్య యాదవ్, లోక్యతండ మాజీ సర్పంచ్ హనుమా నాయక్, యూత్ నాయకులు వంశీ,గ్రామ పెద్దలు,గిరిజన మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags: