విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
విశ్వంభర, నాగారం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ పరీక్షల ప్రిపరేషన్ కోసం స్టడీ మెటీరియల్‌ను సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివి రాబోయే బోర్డ్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రతిష్టను నిలబెట్టేలా మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఉప సర్పంచ్ వల్లాల భానుప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందించిన స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో రాణించాలని సూచించారు. గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రామిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పానగంటి నరసింహారెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ర్డ్ మెంబర్లు కె. మనోజ్, భాషకర్ల ఉష పాల్గొన్నారు.



