దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
On
- డా. అజయ్ కుమార్ యాదవ్
విశ్వంభర, బషీర్ బాగ్: రాష్ట్రంలో రోజు రోజుకు బీసీలు, బహుజనులపై దాడులు పెరుగుతున్నాయని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న స్వామి దర్శనానికి వచ్చిన విలుకేశ్వరం చాకలి చంద్రకళ, తన కుమారుడు గణేష్, కోడలు మాణిక్య , రెండు నెలల పసిపాప పై అగ్రవర్ణాలు భౌతిక దాడులకు పాల్పడడం బాధాకర విషయమన్నారు. చిన్న పసిపాపపై దాడి చేసిన నిందితులను రిమాండ్ కు తరలించాలన్నారు. మల్లన్న స్వామి ఆలయంలో అగ్రవర్ణాలు కుట్ర పూర్వకంగానే దాడులు చేశారన్నారు. స్థానిక సర్పంచ్, అతని అనుచరులతో పాటు దాడులకు పాల్పడిన వారందరినీ రిమాండ్ కు పంపాలన్నారు.నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు.



