లక్ష్మీపురంలో తాగునీటి  ఎద్దడి 

లక్ష్మీపురంలో తాగునీటి  ఎద్దడి 

విశ్వంభర, ఎటపాక: ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని బూరుగువాయి తండా ,  లక్ష్మీపురం గ్రామంలోని కన్నయ్య చర్చి గుంపు ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి కణితి మధు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్య కారణంగా ప్రజలు దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే శాశ్వత నీటి సౌకర్యాలు కల్పించాలని ఆయన పంచాయతీ కార్యదర్శిని కోరారు. స్థానిక సర్పంచ్, పంచాయతీ అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించిన కణితి మధు, ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. తాగునీటి సరఫరాలో లోపాలు, నిల్వ సౌకర్యాల కొరత, పైపులైన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గుగులోత్ శ్రీను, మురళి, రాము, బిక్షం, బోడ లింగయ్యతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: