ధర్నాను విజయవంతం చేయండి

ధర్నాను విజయవంతం చేయండి

విశ్వంభర, జనగామ: గ్రామపంచాయతీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్  వద్ద నిర్వహించే  ధర్నాను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వ రామచంద్రు పిలుపునిచ్చారు.ఆ సంఘం మండల అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రంను సూపరింటెండెంట్  పుష్పలతకు అందజేశారు. ఈ సందర్భంగా బస్వ రామచంద్రు మాట్లాడుతూ,  ప్రభుత్వం మారినా తమ కష్టానికి  తగిన ఫలితం లేదని,తమ డిమాండ్లను పరిష్కరించాలని  ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకన్న, పద్మ, కరుణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: