పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు
On
విశ్వంభర, షాద్ నగర్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించనున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు , పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటానికి పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఆంక్షలు విధించారు.పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా చేరడం నిషేధించారు. ఈ ఆంక్షలు ఫిబ్రవరి ఉదయం 6 గంటల నుండి మార్చి 18 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.



