ప్రొ. కరుణాసాగర్ కు సివిరామన్  అవార్డు 

ప్రొ. కరుణాసాగర్ కు సివిరామన్  అవార్డు 

 విశ్వంభర, బషీర్ బాగ్: గత 35 సంవత్సరాలుగా భౌతిక శాస్త్రంలో సీనియర్ ప్రొఫెసర్ గా సేవలు చేస్తున్న ప్రొఫెసర్ డి. కరుణాసాగర్ ను   " సర్ సివి రామన్ ఎక్స్లెన్స్ అవార్డు 2026 "కు  ఎంపిక చేసినట్టు తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ లో ఈనెల ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేస్తామని తెలిపారు. ప్రొఫెసర్ డి కరుణాసాగర్ ఉస్మానియా యూనివర్సిటీ భౌతిక  శాస్త్రం హెచ్ ఓ డి, సి ఎఫ్ ఆర్ డి   డైరెక్టర్ గా ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా , డీన్ ఫ్యాకల్టీగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ గా కొన సాగుతున్నారు. 35 సంవత్సరాలుగా భౌతిక శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్నేలేని కృషి చేస్తూ ఎన్నో సంస్థలచే పురస్కారాలు అందుకొన్నారు. ప్రొఫెసర్ కరుణాసాగర్ 50 కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

Tags: