భూసార పరీక్ష పై విద్యార్థులకు అవగాహన
On
విశ్వంభర, నెల్లికుదురు: నేలలోని పోషకాల సామర్థ్యం తెలుసుకునే ప్రక్రియ భూసార పరీక్ష అని ఏడిఎస్ శ్రీనివాసరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మోడల్ స్కూల్లో 8,9వ తరగతుల విద్యార్థులకు ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం భూసార పరీక్ష పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏ డి ఏ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడీఏ క్షేత్రస్థాయిలో భూసార పరీక్ష విధానం విద్యార్థులకు వివరించారు. భూసార పరీక్షలతో మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్,సేంద్రియ కర్బనం, సూక్ష్మ పోషక లోపాలను తెలుసుకోవచ్చన్నారు. ఇవి కావలసిన మేరకు అందుతేనే పంట దిగుబడి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో మహేందర్, మండల అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ప్రవీణ్,సైన్సు ఉపాధ్యాయులు జ్యోతి, కవిత, లక్ష్మణ్ సింగ్, సునీత పాల్గొన్నారు.



