విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
విశ్వంభర, హైదరాబాద్ : ఆదివాసి కాంగ్రెస్ జాతీయ చైర్మన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జ్హాబువా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విక్రాంత్ బూరియా జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పట్టణంలోని బాగ్ లింగంపల్లి గిరిజన బస్తీలో పుస్తకాలు, పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆదివాసి నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ, యువ డైనమిక్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో డాక్టర్ విక్రాంత్ బూరియా దేశవ్యాప్తంగా ఆదివాసి సమాజాన్ని సంఘటితం చేస్తూ జల్–జంగల్–జమీన్ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని అన్నారు.అలాంటి నాయకుడి జన్మదినాన్ని గిరిజన బస్తీలో జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాక్టర్ రాజేష్ నాయక్, సహా రాష్ట్ర సీనియర్ నాయకులు, విద్యార్థి నాయకులు శ్రీమాన్ నాయక్, హుస్సేన్ నాయక్, శీను నాయక్, జగన నాయక్, రాకేష్, జ్యోతి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.



