నేటి నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
On
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని పారుపల్లి పాత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ, సేవా సమితి సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం వరకు 5రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ, శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు తెలిపారు.



