కాంగ్రెస్ అంటేనే పేదవాడి ప్రభుత్వం

కాంగ్రెస్ అంటేనే పేదవాడి ప్రభుత్వం

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

 విశ్వంభర, పూడూరు: మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామంలో  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,పరిగి ఎమ్మెల్యే  టి.రామ్మోహన్ రెడ్డి  పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ అంటేనే పేదవాడి ప్రభుత్వం అని పేర్కొన్నారు. పేదలకు అండగా నిలుస్తూ పింఛన్ల వ్యవస్థను  కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. పేదవాడికి తినడానికి తిండి,  సంవత్సరానికి వందరోజుల పని ఉండాలని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.కూలీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ టికెట్లు తెలిపారు.మీర్జాపూర్ గ్రామంలో పర్యటించి కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.పనుల పురోగతిని అధికారులు, లబ్ధిదారులను అడిగి తెలుసుకుని, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలనిసూచించారు.అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: