కరాటే ఆత్మరక్షణకు దోహదం చేస్తుంది: గట్ల రవీంద్ర.

కరాటే ఆత్మరక్షణకు దోహదం చేస్తుంది: గట్ల రవీంద్ర.

విశ్వంభర, సరూర్ నగర్ :-మహేశ్వరం నియోజక వర్గం సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ ఓపెన్ టూ ఆల్ స్టైల్స్ కరాటే , కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్  2026 పోటీలకు అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నాయకులు గట్ల రవీంద్ర (హైటెక్ రామ్)కి జ్ఞాపికను అందించి శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న వ్యస్థాపక అధ్యక్షులు, టోర్నమెంట్ నిర్వాహకులు పెద్దవూర శ్రీరాములు.  ఈ సందర్భంగా రవీంద్ర(రామ్) మాట్లాడుతూ కరాటే మరియు కుంగ్ ఫూ పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. కరాటే  కుంగ్ ఫూలను, ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు శిక్షణ ఇప్పించాలని దీని ద్వారా పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా ధృఢంగా ఉంటారని తెలియజేశారు. ఈ పోటీలల్లో బాలికలు కూడా పాల్గొనడం మొచ్చుకో దగ్గ విషయమన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అమ్మాయిలకు చదువుతో పాటు వారి ఆత్మ రక్షణ కోసం ఈ విద్యలు కూడా చాలా ముఖ్యమన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దవూర సైదులు, కనుముల సాయికృష్ణ, బండపల్లి కృష్ణ రావు, మడిశెట్టి వినోద్, లక్ష్మణ్(నాని), చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews