ఫ్యూచర్ సిటీ  పరిధిలో మద్యం దుకాణాల మూసివేత 

ఫ్యూచర్ సిటీ  పరిధిలో మద్యం దుకాణాల మూసివేత 

విశ్వంభర,  షాద్ నగర్:  మున్సిపల్  ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాల మూసివేతకు పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం,1968 లోని సెక్షన్ 20 ప్రకారం, కమిషనరేట్ పరిధిలోని ఆమన్ గల్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, చేవెళ్ల, శంకర్ పల్లి ,  మొయినాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని అన్ని కల్లు దుకాణాలు, వైన్ షాపులు ,రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు. 
సోమవారం  సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు  పూర్తిగా మూసివేయాలి. మళ్ళీ కౌంటింగ్ శుక్రవారం 13 తేదీ ఉదయం 6.00 గంటల నుండి, ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు నిషేధం కొనసాగుతుంది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: