నకిరేకల్ ఎమ్మెల్యే తో రాపోలు భేటీ. చేనేత సమస్యలపై చర్చ.
- తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్
విశ్వంభర, నకిరేకల్ :- స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ మర్యాద పూర్వకంగా వారి నివాసంలో సన్మానం చేశారు. ఈ సందర్బంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత కార్మికుల వ్యక్తిగత ఋణాలు మాఫీ పై బ్యాంకర్స్ విదిస్తున్న ఆంక్షలు వంటి విషయాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంఎల్ఏ తో పలు అంశాలపై ,చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపించే విధంగా ప్రభుత్వం తో మాట్లాడాలని వారు కోరడం జరిగింది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరితగతిన తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగానే చేనేత కార్మికుల సమస్యలపై కూడా అదే విధంగా చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కారించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం తప్పకుండ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



