ఎడ్ల మహేందర్ రెడ్డి  జన్మదిన వేడుకలు 

ఎడ్ల మహేందర్ రెడ్డి  జన్మదిన వేడుకలు 

విశ్వంభర, రామన్నపేట: పేదల పాలిట ఆపద్బాంధవుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మన గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ అన్నారు. గురువారం నాడు ఎడ్ల మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామానికి బహుమతిగా గ్రామపంచాయతీ వద్ద 65 వేల రూపాయలు తన సొంత నిధులతో నీటి శుద్ధి యంత్రం, శీతలీకరణ యంత్రాన్ని (వాటర్ ఫిల్టర్ & వాటర్ కూలర్) సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి-శిల్ప దంపతుల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి ఇంటి వద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎడ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామానికి మరింత సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని రాజకీయాలకతీతంగా పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు ఇస్తూ అండగా ఉంటానని, సేవ చేయడానికి పదవులు అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ మిర్యాల రాజకుమార్, వార్డు సభ్యులు నరేష్, శాంతి, లింగయ్య, మల్లమ్మ, జగన్, భాగ్యలక్ష్మి, ఉమ, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, యువ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఈడెం శ్రీనివాస్, తలారి నరసింహ, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మహేందర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

Tags: