ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "ప్రజాపాలన" ప్రారంభం #Draft: Add Your Title
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, విద్యార్థులు తమ పరిసరాలలో చెత్త వేయడం, ఇతరులను వేయనీయక పోవడం వంటి పనులు చేయడం వల్ల మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడానికి దోహదపడుతాయని అన్నారు. ఇవ్వాళ బాగా అభివృద్ధి చెందిన దేశాలు పరిశుభ్రంగా ఉండడానికి కారణం ఇలాంటి కార్యాచరణకు పూనుకోవడమే. కావున విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఈ 99 రోజుల కార్యక్రమాల్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే, అధ్యాపకులచే పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా కళాశాల ఆవరణను శుభ్రం చేయడం, చెట్ల చుట్టూ గుంతలు తీయడం లాంటి పనులను విద్యార్థులు, అధ్యాపకులు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్-ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



