ఐఎన్‌టీయూసీ భవన్‌లో మహిళా దినోత్సవం 

ఐఎన్‌టీయూసీ భవన్‌లో మహిళా దినోత్సవం 

విశ్వంభర, నారాయణగూడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని హైదరాబాదు నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ భవన్‌లో శుక్రవారం సాయంత్రం మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోసం క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నాయకురాలు శైలజ రెడ్డి, ఐఎన్‌టీయూసీ మహిళా జనరల్ సెక్రటరీ ఉమా నాగేంద్రమణి, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్.డి. చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి అండగా నిలుస్తానని తెలిపారు. మహిళలు ఆర్టీసీలో తమ హక్కుల సాధన కోసం ఏ విధంగా పోరాడాలో అవగాహనతో ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్టీసీ ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహం, టీఎస్‌ఆర్టీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు విజయ భాస్కర్, సాయిరాం జయ, అక్బర్, పాండు, శివకుమార్ పాల్గొన్నారు. అలాగే ఛాయాదేవి, శాంతి కుమార్, మాధవి, కృష్ణవేణి తదితరులు హాజరయ్యారు.

Tags: