సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి

  • 200 కేజీల భారీ కేక్ ని చిన్నారులతో కలిసి కట్ చేసిన జగ్గారెడ్డి
  • 12 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో ఏం చేశారో బీజేపీ నేతలు సమాధానం చెబుతారా
  •  ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రధాని మోదీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారు ?
  • రాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశం కోసం ఎం చేశారో నేను చెబుతా
  • రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది
  • ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

విశ్వంభర, సంగారెడ్డి: బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో జగ్గారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నెహ్రు పాలనని బ్రేక్ చేశామని బీజేపీ నేతలు సంబరాలు చేస్తున్నారని అన్నారు.

WhatsApp Image 2026-06-19 at 6.29.49 PMరాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశం కోసం ఏం చేశారో తాను వివరిస్తానని తెలిపారు. మరి12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో ఏం చేశారో సమాధానం చెబుతారా? అంటూ బీజేపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రధాని మోదీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో టీజీఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి: డీజీపీ సి.వి. ఆనంద్

🕒 19 Jun 2026 ✍️ Desk

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జగ్గారెడ్డి

విశ్వంభర, సంగారెడ్డి: బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో జగ్గారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నెహ్రు పాలనని బ్రేక్ చేశామని బీజేపీ నేతలు సంబరాలు చేస్తున్నారని అన్నారు.

WhatsApp Image 2026-06-19 at 6.29.49 PMరాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశం కోసం ఏం చేశారో తాను వివరిస్తానని తెలిపారు. మరి12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో ఏం చేశారో సమాధానం చెబుతారా? అంటూ బీజేపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రధాని మోదీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో టీజీఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/rahul-gandhis-birthday-celebrations-in-sangareddy-under-the-leadership-of/article-16796