విజయవంతంగా ముగిసిన జె ఎస్ ఆర్ చలివేంద్రాలు
- టీం సభ్యులకు ఘన సన్మానం
విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు విజయవంతంగా ముగిశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ వేసవిలో కూడా ప్రజల దాహార్తిని తీర్చేందుకు 20 చలివేంద్రాలను ఏర్పాటు చేసి, సుమారు 25 లక్షల లీటర్ల కూల్ మినరల్ వాటర్‌ను ప్రజలకు అందించారు. ఇందుకోసం జేఎస్ఆర్ స్వంతంగా రూ.50 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు.వేసవి తీవ్రతలో బాటసారులు, వాహనదారులు, ప్రజలకు ఉచితంగా చల్లని నీరు అందించడం ద్వారా వేలాది మందికి ఉపశమనం కలిగిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగంగా జేఎస్ఆర్ చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 100 రోజుల పాటు చలివేంద్రాల నిర్వహణలో కీలకంగా పనిచేసిన టీం సభ్యులు రాహుల్, అఖిల్‌లను జేఎస్ఆర్ శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, టౌన్ కార్యదర్శి బుర్ర రాజు, టీం జె ఎస్ ఆర్ సభ్యులు పాకల రాజిరెడ్డి, కనకం వెంకట్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.