భూ పోరాటానికి ఉద్యమకారుల పిలుపు

భూ పోరాటానికి ఉద్యమకారుల పిలుపు

విశ్వంభర, హైదరాబాదు : ఉద్యమకారులకు హామీ ఇచ్చిన భూములు ఇవ్వకపోతే పోరాటం ఆగదని తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జూలై 2న నిర్వహించనున్న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బహదూర్‌పురలో సోను భాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల కేటాయింపు వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో:  బహదూర్‌పుర ఇన్‌చార్జి; దుగుంట్ల నరేష్ ప్రజాపతి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌చార్జి; మల్లూరి అనిల్ కుమార్ ఉద్యమకారులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/activists-call-for-land-struggle/article-16734

Tags: