రామంతాపూర్ చెరువుకు పూజలు
విశ్వంభర, హైదరాబాదు : చెరువుల పరిరక్షణ నగర భవిష్యత్తుకు కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం హైదరాబాదు ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను భూమి పూజతో ప్రారంభించారు. రెండో విడతలో చేపట్టిన పనుల్లో భాగంగా ఈ చెరువు అభివృద్ధికి సుమారు రూ.19 కోట్ల వ్యయం చేయనున్నారు. మొత్తం 30 ఎకరాల ఎఫ్‌టీఎల్ విస్తీర్ణంలో 16 ఎకరాలు ఆక్రమణలకు గురవగా, తాత్కాలిక నిర్మాణాలను తొలగించి 18 ఎకరాలకు పైగా భూమిని అందుబాటులోకి తెచ్చారు. చెరువు అభివృద్ధి ద్వారా వరద ముప్పు తగ్గడంతో పాటు భూగర్భ జలాల మట్టం మెరుగుపడనుంది. చెరువు పరిధిలో నివసిస్తున్న 36 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తాము.ఈ కార్యక్రమంలో: హైడ్రా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.