ప్రభుత్వ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : జాన్ వెస్లీ
విశ్వంభర, ముషీరాబాదు : పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. హైదరాబాదు ముషీరాబాదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. 2021లో ప్రారంభించిన అదనపు భవన నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంతో సుమారు 800 మంది విద్యార్థులు తరగతి గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేదని, యూనిఫామ్‌లు ఇంకా అందలేదని, ఉపాధ్యాయుల కొరత కూడా ఉందని వెల్లడించారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే విద్యా ప్రమాణాలు మెరుగుపడవని అన్నారు.ప్రభుత్వం నాణ్యమైన భోజనం, యూనిఫామ్‌లు, తగిన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్, కార్యదర్శివర్గ సభ్యుడు ఎం దశరథ్, ముషీరాబాదు జోన్ కార్యదర్శి ఆర్ వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా నాయకులు లెనిన్, అశోక రెడ్డి, నాగేందర్, రజనీకాంత్, ఆంజనేయులు పాల్గొన్నారు.