పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి

విశ్వంభర, ఇనుగుర్తి: మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు మనందరం కృషి చేయాలని అటవీ శాఖ అధికారి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పర్యావరణం కాపాడు కొంటేనే జీవులకు మనుగడ చేకూరుతుందని చెప్పారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇనుగుర్తి మండలం తావుర్యా తండా ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశం పై అటవీ శాఖ ఆధ్వర్యంలో  వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ..సంబంధిత పోటీలు నిర్వహించి పర్యావరణం పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించినట్లు తెలిపారు. అనంతరం బాల బాలికలకు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/environmental-protection-is-the-responsibility-of-all-of-us/article-16233

Tags: