చట్ట సభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి : కనినికా ఘోష్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: చట్ట సభలల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన మహిళా రిజర్వేషన్ల అమలు- కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ఆమె మాట్లాడుతూ 1995 నుండి ఇప్పటి వరకు గత 30సం॥రాలుగా నాటి కాంగ్రేస్ పాలకులనుండి నేటి మోడి పాలకుల వరకు మహిళలకు రిజర్వేషన్లు ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెబుతూ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయలేదని అన్నారు. 2010లో కాంగ్రేస్ పాలనలో రాజ్యసభలో అమోదం పొందిన బిల్లు ఏకాభిప్రాయం పేరుతో పార్లమెంట్లో చట్టం చేయలేదు. ఆ తరువాత పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి 2023 లో పార్లమెంట్లో నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టం చేసింది. కానీ ఈ చట్టం అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత అన్నారు. వీటిపై ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కాకుండా మహిళా రిజరేషన్ల అమలుకు ఈ రకమైన సంకెళ్ళు వేయటాన్ని ఐద్వా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. అందుకే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల అమలుకు విధి విధానాలు రూపొందించి వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఐద్వాగా మరియు, ఐక్య మహిళా సంఘాలుగా, ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఐద్వా 14వ జాతీయ మహాసభల సావనీర్ ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె. శ్రీమతి, కనినికా ఘోష్ , ఉపాధ్యాక్షులు ఎస్. సుధాసుందర రామన్, ఎస్. పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయకార్యదర్శులు కె. ఎన్. ఆశాలత, బి.సరళ, కోశాధికారి, ఎమ్. భారతి, ఉ పాధ్యాక్షులు టి. జ్యోతి, సహాయకార్యదర్శులు పి. ప్రభావతి, బండి పద్మ రాష్ట్ర ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.