కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

విశ్వంభర, అంబర్‌పేట: పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కీలకమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. హైదరాబాదు అంబర్‌పేట అలికేప్ చౌరస్తాలోని ఎస్‌ఆర్‌జి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి 298 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వి. హనుమంతరావు అందజేశారు. ఇందులో షాదీ ముబారక్ 200, కల్యాణ లక్ష్మి 98 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ పేదింటి కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాలు ప్రవేశపెట్టబడినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఇ. విజయ్ కుమార్ గౌడ్, పద్మ వెంకటరెడ్డి,,  ఎమ్మార్వో అన్వర్ హుస్సేన్, మోతె రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-kalyana-lakshmi-cheques/article-16742

Tags: