జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
విశ్వంభర, హుస్నాబాద్: జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మహ్మద్ ఖుద్రత్ అలీ డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ, చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా గన్‌పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన, ఆందోళన, సమ్మె వంటి హక్కులు అత్యంత ప్రాథమికమైనవని, వాటిని అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రజల స్వరాన్ని వినడం, వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కార్మిక హక్కులు, భూపరిమితి చట్టాలు, ఆదివాసీ హక్కులు వంటి అనేక ప్రజా ప్రయోజన చట్టాలు ప్రజా ఉద్యమాల ఫలితంగానే వచ్చాయని గుర్తు చేశారు. నిరసన హక్కు లేకుండా ప్రజాస్వామ్యం అర్థం కోల్పోతుందని, నిరసనలను నేరంగా చూడకూడదని అన్నారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రతి జర్నలిస్టుకు ఉచిత బీమా పథకం అమలు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అందించాలని, సంక్షేమ నిధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, గృహాలు మంజూరు చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.