నారాయణ హైస్కూల్‌ను వెంటనే సీజ్ చేయాలి

నారాయణ హైస్కూల్‌ను వెంటనే సీజ్ చేయాలి

  •  విద్యార్థి సంఘాల నేతల డిమాండ్

విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్లోని నారాయణ హై స్కూల్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హైస్కూల్‌ను వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పాఠశాల ఆవరణలో విద్యార్థి సంఘాల నేతలు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అనుమతి లేకుండా స్కూల్‌ను ఎలా నడుపుతారంటూ అధికారులను నిలదీశారు. యాజమాన్యం తప్పుడు సమాచారంతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ తరగతులు నిర్వహిస్తోందని, తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి సదరు స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ దౌర్జన్యంగా నడుపుతున్న ఈ విద్యాసంస్థను రేపటి నుంచి మూసివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా బిల్డింగ్ యజమాని నుండి నారాయణ స్కూల్ గడువు ముగిసిందని, అయినప్పటికీ ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్ రన్ చేస్తున్నారని,బోడుప్పల్‌లోని నారాయణ హైస్కూల్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని మేడిపల్లి మండల విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాల యాజమాన్యం రెన్యువల్ పొందలేదని వెల్లడించారు. అయినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా కొత్త అడ్మిషన్లు చేపడుతూ, తల్లిదండ్రుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేస్తూ, పాఠశాల యాజమాన్యానికి  ప్రభుత్వ అనుమతులు వచ్చే వరకు అడ్మిషన్లను, ఫీజుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని, లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/narayana-high-school-should-be-seized-immediately/article-16774

Tags: