కందుల దివ్య ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న గాంధీజీ విద్యార్థిని కందుల దివ్య
విశ్వంభర, చండూరు: మార్చి 2026 పదవ తరగతి ఫలితాల్లో 579 మార్కులు సాధించిన గాంధీజీ స్కూల్ విద్యార్థిని కందుల దివ్య ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రశంసా పత్రం అందించి, అభినందించారు. పేద కుటుంబంలో జన్మించిన కందుల దివ్య జి.యడవల్లి గ్రామం నుండి ప్రతిరోజు చండూరు రావడానికి ఇబ్బంది పడి, చండూరులోని షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ వారి బాలికల వసతి గృహంలో సీటును పొంది అక్కడే ఉంటూ గాంధీజీ పాఠశాలలో చదువుకుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 579 మార్కులతో ఉత్తమ ఫలితాన్ని సాధించింది. బాలికల వసతి గృహంలో ఉంటూ నల్లగొండ జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నాడు లాల్ బహుదూర్ స్టేడియం నందు ప్రశంసా పత్రం అందుకుందని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, హాస్టల్ వార్డెన్ రమ్యశ్రీ తెలిపారు. కందుల దివ్య ను అతని తల్లిదండ్రులను తోటి స్నేహితులు, ఉపాధ్యాయులు అభినందించి, భవిష్యత్తులో దివ్య ఉన్నత స్థానంలో ఉండాలని ఆశించారు.