ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి 

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి 

విశ్వంభర, అంబర్‌పేట :   ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం కావాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే హైదరాబాదు అంబర్‌పేట  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైడ్రా, శానిటేషన్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ శాఖల పనితీరు, నేషనల్ హైవే పనుల పురోగతిపై చర్చించి శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో: వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/public-problems-should-be-solved-immediately/article-16749

Tags: