అశోక్ కాలనీలో గిరిజన బాలుర కళాశాల వసతి గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని..

విశ్వంభర, హానుమకొండ:- అశోక్ కాలనీలోని ఐటీడీఏ గిరిజన కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, భోజనం, విద్యా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వసతి గృహ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది సేవాభావంతో పనిచేస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి  గొట్టిముక్కుల నాగసాగర్, సహాయ గిరిజన అభివృద్ధి అధికారి శ్రీమతి హసీనా బేగం, ఏసీఎంఓ శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహ అధికారులు రాజయ్య, ఆల్య, సుధాకర్, రాజారావు, శ్రీనివాస్, బ్రహ్మచారి, కృష్ణమోహన్, షేక్ అలీ, జ్యోతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/mla-naini-started-the-tribal-boys-college-hostel-in-ashok/article-16697

Tags: