ఆశించిన స్థాయిలో విద్యా ఫలితాలు రాని ప్రభుత్వ విద్యా వ్యయం.. 

విశ్వంభర, రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై విద్యకోసం సంవత్సరానికి సుమారు రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యా ఫలితాలు కనిపించడం లేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులే తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో తక్కువ వ్యయంతో విద్య అందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న భారీ వ్యయానికి తగిన విద్యా ప్రమాణాలు సాధించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, విద్యార్ధుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థిపై భారీగా వ్యయం జరుగుతోందని పేర్కొన్నారు. అంతటి ఖర్చు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో అభ్యాస ఫలితాలు రావడం లేదని, అందుకే విద్యా నాణ్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ముందుగా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే మిగతా వారికి మార్గదర్శకంగా ఉంటుందని, తద్వారా విద్యా ప్రమాణాల నాణ్యత కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/government-expenditure-on-education-which-does-not-produce-expected-educational/article-16780

Tags: