సీపీఐ(ఎం) నేతలతో మాజీ మావోయిస్టుల భేటీ
విశ్వంభర, హైదరాబాదు : ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. హైదరాబాదులోని ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) ప్రతినిధులతో మాజీ మావోయిస్టులు దేవ్‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ దేశంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దోపిడీ పెరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను విమర్శిస్తూ, సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మాజీ మావోయిస్టు దేవ్‌జీ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వివిధ రాజకీయ, ప్రజాసంఘ నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేరే అంశంపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో: జాన్ వెస్లీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి; దేవ్‌జీ, మాజీ మావోయిస్టు; రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్ మాజీ మావోయిస్టులు; జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, టి సాగర్, ఎండీ అబ్బాస్ కార్యదర్శివర్గ సభ్యులు; జి రాములు తదితరులు పాల్గొన్నారు.