సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం

విశ్వంభర, హైదరాబాదు : జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేదంటే ఉద్యమాలు తీవ్రం అవుతాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. ‘ఛలో హైదరాబాద్’ పిలుపు మేరకు గురువారం హైదరాబాదు గన్ పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, అనంతరం ర్యాలీగా సచివాలయం వైపు కదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పత్రికా రంగం సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇండ్లు, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, బీమా, పెన్షన్, ఉచిత ప్రయాణం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ర్యాలీని పోలీసులు అడ్డుకుని జర్నలిస్టులను అరెస్టు చేసి పంజాగుట్ట, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు; బండి విజయ్ కుమార్, యాదగిరి రాష్ట్ర కో-కన్వీనర్లు; తన్నీరు శ్రీనివాస్ నాయకుడు; చిర్రా శ్రీనివాస్ నేషనల్ కౌన్సిల్ మెంబర్; దామెర జగదీశ్వర్ గుప్తా, కే. పాండురంగారావు, సామ్రాట్ గుప్తా, జర్నలిస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు.