జిల్లాలో ఘనంగా వన మహోత్సవం 

జిల్లాలో ఘనంగా వన మహోత్సవం 

  • వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్క నాటి నీరుపోసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్ :  గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామండ్లపల్లిలో వన మహోత్సవం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్, డిఎఫ్ఓ విశాల్ బత్తుల, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన మొక్కల లక్ష్యాలను చేరుకోవాలని పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు, జిల్లాలో శాఖల వారీగా వన మహోత్సవం లక్ష్యాలు వ్యవసాయ 1లక్ష, 60 వేల మొక్కలు, బీసీ వెల్ఫేర్ 5వేలు, పంచాయతీరాజ్ 30 వేలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ 31 లక్ష 40 వేలు , ఎక్సైజ్ 60 వేలు, ఫారెస్ట్ 4. లక్షల 50 వేలు, మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 5 వేలు, హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ 1 లక్ష 30 వేలు, పరిశ్రమల శాఖ 7 వేలు, ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్ 3 వేలు, ఇరిగేషన్ 11 వేలు, మైనారిటీ వెల్ఫేర్ 5 వేలు, మున్సిపల్ అథారిటీస్ 2. లక్షల 50 వేలు, పోలీస్ 60 వేలు, రోడ్లు భవనాల శాఖ 10 వేలు, పాఠశాల విద్యాశాఖ 15 వేలు, గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ 10 వేలు,  మొత్తం 43 లక్షల 51 వేల మొక్కల లక్ష్యం పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కల పెంపకం సంరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ట్రీ గార్డ్, రక్షణ ఏర్పాట్లు చేయాలని, సమయానికి నీరు అందించాలని, ఎవెన్యూ ప్లాంటేషన్, మంకీ ఫుడ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను నాటాలని, ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ పరిధిలో డిమాండ్కు అనుగుణంగా మొక్కలను పెంపకం చేపట్టి వెంటనే అందించాలని, సూచించారు. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా హార్టికల్చర్ అధికారి జినుగు మరియాన్న, ఫారెస్ట్ రేంజర్ అధికారి సురేష్, స్థానిక కౌన్సిలర్లు రజిత, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-forest-festival-in-the-district/article-16782

Tags: