చివ్వెంల పోలీస్ ''ఆపరేషన్ చబుత్రా ''

చివ్వెంల పోలీస్ ''ఆపరేషన్ చబుత్రా ''

  •  స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు 

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఆదేశాల మేరకు చివ్వెంల మండల పరిధిలో పోలీసులు ఆపరేషన్ చబుత్రా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక నిఘా తనిఖీల్లో భాగంగా చివ్వెంల సబ్ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారి -65 వెంట ఉన్న పలు హోటళ్లు, లాడ్జీలలో, దాబాలలో ముమ్మర సోదాలు చేపట్టారు. ఈ ఆపరేషన్ చబుత్రా తనిఖీల ముఖ్య ఉద్దేశాలు, శాంతిభద్రతల పరిరక్షణ, అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వ్యక్తులను నియంత్రించడం, శాంతిభద్రతలను కాపాడటం అని ఎస్ఐ అన్నారు. జాతీయ రహదారి పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు (డ్రగ్స్, గంజాయి రవాణా, దొంగతనాలు, మద్యం సేవించి గొడవలు చేయడం జరగకుండా నిరోధించడం లో భాగంగా చర్యలు చేపట్టాం అన్నారు. మండల పరిధిలోని లాడ్జీలు, హోటళ్లకు వచ్చే కొత్త వ్యక్తుల వివరాలను, వారి ఆధార్ కార్డులను, సీసీటీవీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది. హోటళ్లు, లాడ్జ్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై గుంపులుగా చేరి కాలక్షేపం చేసే యువతకు, రోడ్డు పక్కన బైక్‌లపై తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించా

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chivvenla-police-operation-chabutra/article-16699

Tags: