పట్టణాభివృద్ధి కి అధికారులు సమన్వయంతో పనిచేయాలి 

  • మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు చేపట్టాల్సిన పనులు,అభివృద్ధి కార్యక్రమాల  పురోగతిపై సమీక్ష నిర్వహించారు.  సమావేశంలో కౌన్సిల్ సభ్యులు,మున్సిపల్ అధికారులు పాల్గొని పట్టణానికి సంబంధించిన వివిధ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజా సంక్షేమం పట్టణాభివృద్ధి కి ప్రాధాన్యతనిస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత వెంకటేష్, మున్సిపల్  కమిషనర్ కే.మల్లేష్ ,వైస్ చైర్మన్ హనుమంతు, కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/authorities-should-work-in-coordination-for-urban-development/article-16736

Tags: