తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం

విశ్వంభర, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి  హనుమకొండ కూడా ఆఫీస్ ప్రక్కన నూతన కార్యాలయ భవనం,జోనల్ లాబొరేటరీ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి  వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన మౌలిక సదుపాయాలతో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. నూతన కార్యాలయ భవనం, జోనల్ లాబొరేటరీ సముదాయం ద్వారా కాలుష్య పర్యవేక్షణ, నమూనాల విశ్లేషణ, పర్యావరణ ప్రమాణాల అమలు మరింత వేగవంతం కానున్నాయి. అధునాతన పరికరాలతో కూడిన ప్రయోగశాలలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాల నియంత్రణకు, పర్యావరణ నాణ్యత పరిరక్షణకు ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో  డి. నరేందర్ , జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జోనల్ ఆఫీస్, హైదరాబాద్  ఎస్. వేణుగోపాల చార్యులు , జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, బోర్డు ఆఫీస్, హైదరాబాద్, శ్రీ బి. జీమూత వాహన, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, జోనల్ లాబొరేటరీ, వరంగల్, శ్రీ జి. శ్రీవాస్తవ  సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జోనల్ ఆఫీస్, హైదరాబాద్, రాజేందర్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, హైదరాబాద్,  ఆర్ సునీత  ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, రీజినల్ ఆఫీస్, వరంగల్, శ్రీ ఎం. సుభాష్ నాయక్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, రీజినల్ ఆఫీస్, వరంగల్ మరియు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-telangana-pollution-control-board-regional-office/article-16728

Tags: