పాఠ్య పుస్తకాలు పంపిణీ. -  జిల్లా విద్యాశాఖ అధికారి  ఏ . సత్యనారాయణ మూర్తి .

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నీ జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణమూర్తి  సందర్శించారు . అనంతరం   నూతన విద్యా సంవత్సరం 2026-2027  సంవత్సరానికి విద్యార్థిని ,  విద్యార్థులు చదువుకోవడానికి  స్కూల్ ప్రధానో పాధ్యాయులు  పూజారి వీరయ్య ఆధ్వర్యంలో  పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలను  కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు ,  కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు  మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని ,  ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా  సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు . నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశారని గుర్తు చేశారు .  జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యందు  2025 -26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి, ఐఐటి బాసరలో  సీట్లు  సాధించారని ,
 పాఠశాల నిర్వహణ యందు చక్కటి ప్రతిభను కనబరుస్తున్న ప్రధానోపాధ్యాయులు  మరియు ఉపాధ్యాయ బృందాని అభినందించారు . ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్స్ ఎం వెంకటేశ్వర్లు, సీఎంఓ  వి సురేష్, జెండర్ క్వాలిటీ కోఆర్డినేటర్ వై గాయత్రి,  మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు .

🕒 16 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691

Tags: