ఫర్టిలైజర్ దుకాణాల్లో ఏవో ఆకస్మిక తనిఖీలు 

విశ్వంభర, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగుమామిడి మండలం ఇందుర్తి లోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి పూర్ణచందర్, తిమ్మాపూర్ సీఐ రమేష్, చిగురుమామిడి ఎస్సై పృథ్వీదర్ గౌడ్ తో కలిసి ఆకస్మిత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, ధరల పట్టికలు, లైసెన్సుల వివరాలను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వ నిబంధన మేరకు విక్రయించాలన్నారు. ఎరువుల దుకాణం యజమానులు తప్పనిసరిగా ధరల పట్టి కనిపించే విధంగా డిస్ప్లే చేయాలన్నారు..అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/what-are-random-inspections-of-fertilizer-shops/article-16716

Tags: