మోదీ పాలనపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
విశ్వంభర, బర్కత్‌పుర : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో హైదరాబాదు బర్కత్‌పురలో బీజేపీ నగర కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం ఆర్థిక, సైనిక, దౌత్య రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మాట్లాడుతూ, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువతకు అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో: ఏడెల్లి అజయ్ కుమార్, గడ్డం వెంకటస్వామి, ప్రేమ్ కుమార్, కన్నె రమేష్ యాదవ్, రాహుల్ చంద్ర, మోతుకుల శ్యామ్ రాజ్, సుప్రియ గౌడ్, రాఘవ రెడ్డి , రాంచందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.