ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ కు రాజేశ్వరి ఎంపిక
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని ఆలేరు హై స్కూల్ విద్యార్థిని వై.రాజేశ్వరి ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి ఏ రామదాస్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన స్కాలర్షిప్ టెస్ట్ లో రాజేశ్వరి మంచి ప్రతిభ కనబరిచి స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు తెలిపారు. సంబంధిత విద్యార్థినికి 12వ తరగతి వరకు ప్రతి యేట రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ ప్రభుత్వం అంద చేస్తుందని చెప్పారు.ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థినిని ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.