ముమ్మరంగా పాఠశాల వాహనాల తనిఖీలు

ముమ్మరంగా పాఠశాల వాహనాల తనిఖీలు

విశ్వంభర, హైదరాబాదు:  విద్యార్థుల భద్రతకు ఎక్కడా రాజీ ఉండదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వాహనాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, హైదరాబాదులో ప్రారంభించిన ప్రత్యేక తనిఖీలు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పాఠశాల వాహనాల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఘటనలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు జూన్ 16 నుంచి ప్రత్యేక తనిఖీలు ప్రారంభించి కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు 1852 వాహనాలను పరిశీలించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలించినందుకు 149 ఆటో రిక్షాలపై కేసులు నమోదు చేయగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన 2 డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు వాహనాల సీటింగ్ సామర్థ్యాన్ని కచ్చితంగా పాటించడంతో పాటు డ్రైవర్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను హెల్ప్‌లైన్ 9010203626కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి. జోయల్ డేవిస్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్; ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/intensive-inspections-of-school-vehicles/article-16760

Tags: