ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి : మండలంలోని రాఘవపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గృహప్రవేశ వేడుకలో పాల్గొని లబ్ధిదారులతో ఆనందాన్ని పంచుకున్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. తమ సొంత ఇంటి కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, రాములు, తదితరులు పాల్గొన్నారు.